ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

ముఖ్యమైన పాయింట్స్:ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతిలక్ష్మీపల్లి స్టేజీ వద్ద ఘటన.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలుసీకే న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి చిన్నంబావి మండల పరిధిలోని లక్ష్మీపల్లి స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని సుజాతమ్మ (55) మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పెబ్బేరు నుంచి కొల్లాపూర్ వెళ్తున్న కొల్లాపూర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు (టీజీ 31 జెడ్ 0021) లక్ష్మీపల్లి స్టేజీ వద్ద ఆగకుండా ముందుకు వెళ్తుండగా బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళా ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో సుజాతమ్మ బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు....