జెన్–జీ మూవ్‌మెంట్‌పై విద్యార్థులకు అవగాహన

ముఖ్యమైన పాయింట్స్:జెన్–జీ మూవ్‌మెంట్‌పై విద్యార్థులకు అవగాహన బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా గద్వాలలోని *TGSWRS జూనియర్ కళాశాల (బాలుర)* ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి కళాశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థులకు జెన్–జీ మూవ్‌మెంట్ లక్ష్యాలు, యువత పాత్ర గురించి వివరించారు. యువత చదువుతో పాటు సామాజిక–రాజకీయ అంశాలపై అవగాహన పెంచుకొని, సమాజ మార్పులో కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.