ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి

ముఖ్యమైన పాయింట్స్:ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలిబీసీ రాజ్యాధికార యాత్రలో తీన్మార్ మల్లన్నకు వినతిపత్రం తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి, ప్రభుత్వ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా ఉపాధి కల్పించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు కోరారు. బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ తదితర అన్ని చట్టబద్ధ సౌకర్యాలను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని తాను మండలిలో...