వైద్యానికి ఎల్లలు లేవు.. మానవత్వానికి హద్దులు లేవు”

ముఖ్యమైన పాయింట్స్:*ఎల్లలు దాటిన మానవత్వం.. వైద్యానికి ప్రాంతం లేదు**ఆపదలో ఆపద్బాంధవుడు.. గాయపడిన యువకుడికి డాక్టర్ రాజశేఖర్ గౌడ్ చేయూత**రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడిని స్వయంగా కారులో ఆస్పత్రికి తరలించిన డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్* ఖమ్మం: విధి నిర్వహణ ముగించుకుని తిరిగి వెళ్తున్న ఖమ్మం డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చూసి మానవత్వంతో స్పందించిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. కలెక్టరేట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో *మధ్యప్రదేశ్‌కు చెందిన అభిషేక్* అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వాటర్ క్యాన్లతో వెళ్తున్న ఆటో ట్రాలీ ప్రమాదానికి గురికావడంతో అభిషేక్ రోడ్డుపై తీవ్ర గాయాలతో పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అక్కడ గుమిగూడారు....