నాలుగు దశాబ్దాల పాత్రికేయ సేవకు అరుదైన గౌరవం
ముఖ్యమైన పాయింట్స్:తెలుగు వెలుగు సాహితి వేదిక అవార్డు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ కొత్త వెంకటేశ్వర్లుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా,సి.కె న్యూస్ ప్రతినిధి, ఇల్లందు సెప్టెంబర్ 28 : ప్రజా సమస్యలను తన కలం ద్వారా వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కొత్త వెంకటేశ్వర్లుకు అరుదైన గౌరవం లభించింది. సెప్టెంబర్ 27 ఆదివారం వరంగల్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు వెలుగు సాహితి వేదిక ఆధ్వర్యంలో ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు. ప్రజల సమస్యలే తన వార్తలకు ప్రాధాన్యం కొత్త వెంకటేశ్వర్లు గత నాలుగు దశాబ్దాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో సీనియర్ జర్నలిస్టుగా, ఆంధ్రజ్యోతి ఇన్చార్జిగా పాత్రికేయ రంగంలో...