రైతుతో మాటాముచ్చట.. పొలంలో మల్లన్న సందడి!

ముఖ్యమైన పాయింట్స్:బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా కొడంగల్ ప్రాంతంలో రైతుతో ముచ్చటించిన తీన్మార్ మల్లన్న రైతు పొలానికి వెళ్లిన మల్లన్న.. వ్యవసాయం ఎలా సాగుతోంది? ఏయే పంటలు పండిస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతోంది? పంట పెట్టుబడి ఎంత అవుతోంది? సాగుకు సరిపడా నీరు అందుబాటులో ఉందా? తదితర అంశాలను రైతును అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, పంటల సాగు పరిస్థితులు, రైతుల అవసరాల గురించి ఆయనతో మాట్లాడారు. అనంతరం రైతు పొలంలో స్వయంగా ట్రాక్టర్ నడిపిన తీన్మార్ మల్లన్న, ఎడ్లతో పొలం దున్నుతూ వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు.