క్రిస్మస్ వేడుకల నిర్వహణకు చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయం
- ఈ నెల 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి – జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సిరాజుద్దీన్ అహ్మద్
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చర్చిలకు సున్నం వేయడం (వైట్‌వాష్), విద్యుత్ దీపాలంకరణ తదితర ఏర్పాట్ల కోసం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి చర్చికి రూ.30,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. వనపర్తి జిల్లా పరిధిలోని నమోదిత చర్చిల నిర్వాహకులు 2026 నవంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు OBMMS వెబ్‌సైట్ (tgobmms.cgg.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అనంతరం దరఖాస్తు ప్రతులను డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన పత్రాలను జతచేసి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎం.డి. సిరాజుద్దీన్ అహ్మద్ తెలిపారు. అర్హత కలిగిన చర్చిల నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.