🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 8:40 am Posted by : Charakonda Babu

ఆపదలో ఉన్న మిత్రుడికి అండగా పాత స్నేహితులు, ఫిరోజ్ ఖాన్ వైద్య చికిత్సకు రూ.1.30 లక్షల ఆర్థిక సాయం

News Image
  • 1997–98 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ మానవతా దృక్పథం
  • స్నేహబంధానికి నిలువెత్తు నిదర్శనం

సీకే న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి ఉన్న మిత్రుడికి అండగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని కొల్లాపూర్ చైతన్య హైస్కూల్ 1997–98 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు చాటిచెప్పారు. గతంలో ఫెర్రోజ్ బ్రెడ్ కంపెనీ యజమానిగా ఉన్న తమ ఆత్మీయ మిత్రుడు ఫిరోజ్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న స్నేహితులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. తమ గురువు తిరుపతి రెడ్డి సూచన మేరకు మిత్రుడు ఫిరోజ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న 1997–98 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ మిత్రులందరూ ఒకటిగా నిలిచారు. 'మిత్రమా.. నీకు మేమున్నాం' నీ కష్టంలో నీకు తోడుగా ఉంటాం.. నీ స్నేహబంధాన్ని ఎప్పటికీ వదులుకోం' అంటూ భరోసా కల్పించారు. ఈ క్రమంలో తమ వంతు సహాయంగా రూ.1,30,000 (ఒక లక్ష ముప్పై వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందించి తమ ఉదారతను చాటుకున్నారు. ఆపద సమయంలో ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా, మానసిక ధైర్యాన్ని అందిస్తూ ఫిరోజ్ ఖాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్నేహానికి కులమతాలు, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేదు! చదువుకునే రోజుల్లో ఏర్పడిన స్నేహబంధం ఎన్నేళ్లు గడిచినా చెక్కుచెదరదని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ఒకప్పుడు పాఠశాలలో కలిసి చదువుకున్న మిత్రులు నేడు ఎక్కడెక్కడో స్థిరపడినా, తమలో ఒకరు కష్టాల్లో ఉన్నారని తెలిసిన వెంటనే స్పందించడం అభినందనీయం. ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అది మానవత్వానికి ప్రతి రూపమని పలువురు పేర్కొంటున్నారు. ఫిరోజ్ ఖాన్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని తిరిగి సాధారణ జీవితం గడపాలని, మిత్రులందరితో కలిసి మునుపటిలా ఆనందంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. ఫిరోజ్ ఖాన్ కుటుంబ సభ్యులు మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆపద సమయంలో స్పందించి, మిత్రుడికి ఆర్థిక సహాయం అందించిన చైతన్య హైస్కూల్ కొల్లాపూర్ 1997–98 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. స్నేహం అంటే కలిసి నవ్వడమే కాదు.. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీరు తుడిచి, చేయూత నివ్వడం కూడా! రూ.1.30 లక్షల సహాయం కంటే.. 'నీకు మేమున్నాం' అనే మిత్రుల భరోసానే ఫిరోజ్ ఖాన్‌కు కొండంత ధైర్యం. చైతన్య హైస్కూల్ ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ 1997–98, కొల్లాపూర్ మిత్రబృందం.
🏠 Home