🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 6:43 am Posted by : Chand Pasha

మైనారిటీ అభ్యర్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ.. 300 మందికి అవకాశం

News Image
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు నవంబర్ 24 చివరి తేదీ

మైనారిటీ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వనపర్తి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.
ట్రైనింగ్, ఎంప్లాయిమెంట్ మరియు ప్లేస్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా మొత్తం 300 మంది అభ్యర్థులకు ఐదు విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
శిక్షణ ఇచ్చే కోర్సుల వివరాలు:
ఎలక్ట్రిక్ వెహికల్ స్కిల్ డెవలప్‌మెంట్ – 60 మంది.
సైబర్ సెక్యూరిటీ (బాలికలకు ప్రత్యేకంగా) – 60 మంది.
సైబర్ సెక్యూరిటీ (జనరల్ కేటగిరీ) – 60 మంది.
బేసిక్ కంప్యూటర్, సాఫ్ట్ స్కిల్స్ మరియు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ – 60 మంది.
మెడికల్ కోడింగ్ మరియు బిల్లింగ్ – 60 మంది.
వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనున్నందున ఆసక్తి గల మైనారిటీ అభ్యర్థులు https://www.tgmscccc.com/⁠� వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 24-11-2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
మరిన్ని వివరాలకు హైదరాబాద్‌లోని తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
040-23236112
9059050062
వనపర్తి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ఈ అవకాశాన్ని అర్హులైన మైనారిటీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
🏠 Home