గ్రూప్-2, గ్రూప్-3 ఉచిత ఫౌండేషన్ కోచింగ్కు దరఖాస్తుల ఆహ్వానం
- మైనారిటీ అభ్యర్థులు నవంబర్ 26లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి – జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం.డి. సిరాజుద్దీన్ అహ్మద్
సీకే న్యూస్ ప్రతినిధి – వనపర్తి జిల్లా, నవంబర్ 18:
తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్ ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్-2, గ్రూప్-3 పోటీ పరీక్షలకు ఉచిత బేసిక్ ఫౌండేషన్ కోచింగ్ అందించనున్నట్లు వనపర్తి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం.డి. సిరాజుద్దీన్ అహ్మద్ తెలిపారు.
ఈ కోచింగ్కు అర్హులైన మైనారిటీ అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.
దరఖాస్తు సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఫొటోతో అవసరమైన వివరాలను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ ఉచిత ఫౌండేషన్ కోచింగ్కు కేవలం 100 మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉన్నందున ఆసక్తి గల వారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
040-23236112, 9059050062.
ఈ-మెయిల్: directorsmccctelangana@gmail.com