ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు.. మెడికవర్ వైద్యులు
పటాన్చెరు, నవంబర్ 18(సీ కే న్యూస్ ప్రతినిధి):
ప్రపంచ పిఓపిడి దినోత్సవం సందర్భంగా చందానగర్ మెడికవర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం
నిర్వహించారు.ఊపిరితిత్తుల వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధులను ముందస్తుగా గుర్తించి సరైన చికిత్స అందించాలనే లక్ష్యంతో చందానగర్ మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రపంచ సిఓపిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగ వ్యాధి లక్షణాలు, వ్యాధి రావడానికి గల కారణాలు, నివారణ చర్యలు, ఆధునిక వైద్య చికిత్సా విధానాలపై వైద్యులు ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్మనాలజిస్ట్ డాక్టర్ కె. రవితేజ మాట్లాడుతూ.. సిఓపిడి అనేది ఊపిరితిత్తుల్లోని గాలి మార్గాలు క్రమంగా ఇరుకుగా మారడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగించే దీర్ఘకాలిక వ్యాధి అని తెలిపారు. నెలల తరబడి దగ్గు, కఫం, కొద్దిదూరం నడిచినా ఆయాసం రావడం, ఛాతీలో బిగుతు, శ్వాస తీసుకునేటప్పుడు గురక వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
చాలామంది ఈ లక్షణాలను వయసుతో వచ్చే సాధారణ సమస్యలుగా భావించి చికిత్స తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని, రెండు మూడు వారాలకు మించి దగ్గు, ఆయాసం కొనసాగితే పల్మనాలజిస్ట్ను సంప్రదించి స్పైరోమెట్రీ వంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముందస్తు నిర్ధారణతో వ్యాధి తీవ్రతను నియంత్రించడంతో పాటు మెరుగైన జీవన ప్రమాణాలను పొందవచ్చని పేర్కొన్నారు.
ధూమపానం సి ఓ పి డి వ్యాధికి ప్రధాన కారణమైనప్పటికీ, పొగతాగని వారిలో కూడా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. కట్టెల పొయ్యిల పొగ, వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, పని ప్రదేశాల్లోని దుమ్ము, రసాయనాల పొగకు ఎక్కువకాలం గురికావడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. ధూమపానానికి దూరంగా ఉండటం, వైద్యుల సూచన మేరకు ఇన్హేలర్లను క్రమం తప్పకుండా ఉపయోగించడం, శ్వాస వ్యాయామాలు చేయడం, ఫ్లూ, న్యుమోనియా టీకాలు తీసుకోవడం ద్వారా వ్యాధి ముప్పును తగ్గించుకోవచ్చని సూచించారు.
ఆయాసం ఒక్కసారిగా పెరగడం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలని సూచించారు. ముందస్తు నిర్ధారణ, సరైన చికిత్స, క్రమబద్ధమైన వైద్య పర్యవేక్షణతో వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని, బాధితులు సాధారణ జీవనాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు.