🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:28 am Posted by : G KALYAN KUMAR

తెల్లం శేఖర్ ని హత్య చేసిన అంతకులను వెంటనే ఉరి తియ్యాలి ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్

News Image
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
గుండాల మండల కేంద్రం లొ ఆదివాసీ సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షులు పూనెం రమణ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశం లొ ముఖ్య అతిధులుగా పాల్గొన్న తుడుం దెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు కోడెం వెంకటేశ్వర్లు.ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు V. C. దొర పాల్గొని మాట్లాడుతూ ఆదివాసీ యువకుడు తెల్లం శేఖర్ ని అత్యంత కీరతకంగా హత్య చేసిన హంతకులను నిర్దాక్షణంగా ఉరి తీయాలనీ డిమాండ్ చేశారు. వలస వాదుల చేతిలో ఆదివాసులు బలవుతున్నారు పాలకులు మా చట్టాలను అమలు పరచడంలో పూర్తి స్థాయిలో లోపాలు కనపరుస్తూ ఉండటం ప్రధాన కారణం.భద్రాచలం పూర్తిగా వలస ప్రాంతం ఆంధ్రప్రదేశ్ వలసలు ఇంక కొనసాగుతున్నాయి.హంతకుల ఇళ్లను కూల్చాలి.వాళ్ళ కుటుంబాలను భద్రాద్రి జిల్లా నుండి వెలియ్యాలి. అన్ని ఆదివాసీ సంఘాలు కలిసి భద్రాచలం.ASP.ఆఫీస్ ముట్టడి చేస్తాం అని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లొ గోగ్గేలా సుధాకర్. జబ్బ సుదర్శన్.ప్రతాప్.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home