🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 6:33 pm Posted by : A2TV NEWS

దివ్యాంగులకు రాష్ట్రస్థాయి అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

News Image
  • నవంబర్ 16లోగా దరఖాస్తులు సమర్పించాలి – జిల్లా సంక్షేమ శాఖ అధికారి

సీకే న్యూస్ ప్రతినిధి వనపర్తి జిల్లా:
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 3, 2026న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన దివ్యాంగులు, దివ్యాంగుల సంక్షేమం కోసం విశేష సేవలందించిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు రాష్ట్రస్థాయి అవార్డులు ప్రదానం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు, సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి తెలిపారు.
అవార్డులకు సంబంధించిన దరఖాస్తు నమూనాలు, మార్గదర్శకాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://depwd.sctg.tp.gov.in⁠� నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన వారు ఈ నెల 16-11-2026లోపు తమ దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాలతో జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి విజ్ఞప్తి చేశారు.
🏠 Home