40 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్ల తొలగింపునకు తాత్కాలిక బ్రేక్
పటాన్చెరు, నవంబర్ 06(నవజ్యోతి ప్రతినిధి):
ఓల్డ్ ఎం.ఐ.జి. ప్రాంతంలో గత 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాల ఇళ్ల తొలగింపు చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రైల్వే అధికారులు, పోలీసులు ఇళ్ల తొలగింపునకు వచ్చిన విషయం తెలుసుకున్న పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడి తొలగింపు చర్యలను నిలిపివేయాలని కోరారు.
దశాబ్దాలుగా అక్కడే నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా ఇళ్లను తొలగించడం అన్యాయమని, దీనివల్ల అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో ఫోన్‌లో మాట్లాడి బాధితుల సమస్యను వివరించారు. వారికి ప్రత్యామ్నాయ నివాస సదుపాయాలు కల్పించేలా చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆదర్శ్ రెడ్డి హామీ ఇచ్చారు. అప్పటివరకు నివాసితులకు ఇబ్బందులు కలగకుండా మానవతా దృక్పథంతో కనీసం 45 రోజుల గడువు ఇవ్వాలని రైల్వే అధికారులను విజ్ఞప్తి చేశారు.
ఆదర్శ్ రెడ్డి విజ్ఞప్తికి స్పందించిన రైల్వే సిబ్బంది 45 రోజుల వరకు వేచి ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో బాధిత కుటుంబాలకు తాత్కాలిక ఊరట లభించింది.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, భాస్కర్ ముదిరాజ్, గిరి, నర్సింహ, సంపత్ గౌడ్, చిన్న, తిలావత్, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు