అర్నబ్ తుఫాన్ వల్ల పంటనష్టపోయిన బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
- *అర్నబ్ తుఫాన్ వల్ల పంటనష్టపోయిన బాధిత రైతులనుప్రభుత్వంఆదుకోవాలి*
- *టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు షేక్ హుస్సేన్*
- తల్లాడ, అక్టోబర్ 29
- *సి కె న్యూస్ ప్రతినిది*
ఆరుగాలం వ్యయ ప్రయాసలు కొర్చి పండించిన పంటలు చేతికొచ్చే తరుణంలో తుఫాన్ వల్ల కోల్పోవాల్సి రావడంతో రైతులు కోలుకోలేని నష్టానికి గురి కావాల్సి వచ్చింది. తుఫాన్ ప్రభావం వల్ల ఖమ్మం జిల్లాలోని తల్లాడ, కల్లూరు ,మధిర,ఎర్రుపాలెం, వైరా, కొణిజర్ల,చింతకాని తదితర మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం బలమైన ఈదురు గాలులతో కురిసిన వర్షానికి కోత దశలో ఉన్న వరి పైరు నేలమట్టమైంది.తుఫాన్ ఈదురు గాలుల ఉధృతికి గింజ పోసుకొని కంకి దశలో కోతకు వచ్చిన వరిపైరు చాపచుట్టినట్టు నేలమట్టమై వర్షపు నీటమునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖరీఫ్ వ్యవసాయ సీజన్ లో జూలై మొదటి వారంలో వరి సాగు చేశారు. ఎకరానికి రూ.25వేలు మేరకు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం జిల్లాలో వేలాది ఎకరాల్లో వరిపైరు తుఫాన్ వల్ల ఏపుగా పెరిగి కోతకు వచ్చిన పంటను కోల్పోవాల్సి రావడంతో రైతులు కోలుకోలేనిరీతిలో నష్టం వాటిల్లింది.వరిపైరుతోపాటు పత్తి దూది తీసే దశలోనే పత్తికాయల్లోకి నీరు చేరడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది.