ఇళ్లు నిర్మించుకున్నా.. ఇంటి నంబర్లు కరువు
- 2008 సం,లో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు ఇంటి నంబర్లు ఎప్పుడు
- 18 ఏళ్లుగా నిరుపేదలకు ఎదురుచూపులేనా
- ఇళ్లు నిర్మించుకున్నా.. ఇంటి నంబర్లు కరువు
- బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శివశేఖర్
- సికె న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి
చిన్నంబావి మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు 2008 సం,లో అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అట్టి స్థలాలు కొంతమంది లబ్ధిదారులు అమ్ముకోవడం జరిగింది, కొంత మంది లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తయినా వారికి మరియు కొనుగోలు చేసిన వారికి నేటికీ ఇంటి నంబర్లు కేటాయించక పోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శివశేఖర్. కొంత మంది లబ్ధిదారులు తమ స్థలాలను ఇతరులకు విక్రయించగా, కొనుగోలు చేసిన వారు అప్పటి నుంచి ఇప్పటివరకు వాటిలో ఇళ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. అయితే, ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ గ్రామపంచాయతీ నుంచి ఇంటి నంబర్లు కేటాయించక పోవడం సమస్యగా మారిందని గ్రామ ప్రజలు మరియు శివ శేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నంబర్లు లేక ఇబ్బందులు ఏళ్ల తరబడి కష్టపడి సొంత ఇళ్లను నిర్మించుకున్న ఇప్పటికీ, వాటికి అధికారికంగా ఇంటి నంబర్లు కేటాయించక పోవడం వల్ల ఇళ్లకు సంబంధించిన పంచాయతీ రికార్డులు, ఇతర స్థానిక పరిపాలనా అవసరాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని బాధితులు పేర్కొంటున్నారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లకు నంబర్లు కేటాయించక పోవడంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. అధికారులు స్పందించాలి. సమస్యకు పరిష్కారం చూపాలి! ఈ సమస్యపై గ్రామ పంచాయతీ అధికారులు, చిన్నంబావి మండల అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 2008లో మంజూరైన ఇళ్ల స్థలాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, స్థలాల కొనుగోలు, ఇళ్ల నిర్మాణం, వర్తించే నిబంధనలపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి అర్హత ఉన్న ఇళ్లకు నిబంధనల ప్రకారం ఇంటి నంబర్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పేదలు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు నిర్మించుకున్న ఇళ్లకు గుర్తింపు కల్పించే విషయంలో అధికారులు చొరవ చూపాలని, సమస్యను కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితికి వదిలేయకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించాలని శివ శేఖర్ అధికారులను విన్నవించారు. జిల్లా కలెక్టర్, సంబంధిత పంచాయతీరాజ్ అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి, అయ్యవారిపల్లి గ్రామంలోని బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఇళ్ల స్థలాలకు సంబంధించిన లబ్ధిదారులు మరియు కొనుగోలుదారులు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.