🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 24 October 2026, 10:45 am Posted by : CK NEWS

భగవాన్ నాయక్ తండ సమీపంలో కారు బోల్తా

News Image
  • భగవాన్ నాయక్ తండ సమీపంలో కారు బోల్తా
  • ముగ్గురికి తీవ్ర గాయాలు.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
  • సీకే న్యూస్‌ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ

ఏన్కూరు అక్టోబర్ 24 2026: ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. ఎర్రుపాలెం మండలానికి చెందిన ఐలూరి రాజశేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో పాల్వంచకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మార్గమధ్యలో భగవాన్ నాయక్ తండ సమీపంలో ఎదురుగా వచ్చిన లారీని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డుపై పల్టీ కొట్టినట్లు తెలిసింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏన్కూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి పంపించారు.

ప్రమాదానికి గల పూర్తి కారణాలు, క్షతగాత్రుల పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
🏠 Home