🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 16 October 2026, 12:47 pm Posted by : CK NEWS

నాగర్‌కర్నూల్‌లో టీఆర్పీ జెండా ఆవిష్కరించిన పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

News Image
  • నాగర్‌కర్నూల్‌లో టీఆర్పీ జెండా ఆవిష్కరించిన పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  • మల్లన్న సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వివిధ పార్టీల నాయకుల చేరికలు
  • నాగర్‌కర్నూల్ నుంచి పెద్దకొత్తపల్లి వైపు కొనసాగుతున్న బీసీ రాజ్యాధికార పాదయాత్ర
  • సీకె న్యూస్ ప్రతినిది నాగర్ కర్నూల్

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 16:
బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాకు చేరుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు జిల్లా అధ్యక్షులు బీసం ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు.

అనంతరం నిర్వహించిన పార్టీ చేరికల కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి తీన్మార్ మల్లన్న సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు మల్లన్న గారు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర,జిల్లా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home