చింతకాని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షురాలిగా జొన్నలగడ్డ మల్లీశ్వరి
- చింతకాని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షురాలిగా జొన్నలగడ్డ మల్లీశ్వరి
- కార్యదర్శిగా గుడిది పిచ్చయ్య ఏకగ్రీవ ఎన్నిక
- సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి..
చింతకాని మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షురాలిగా జొన్నలగడ్డ మల్లీశ్వరి(మనం న్యూస్) కార్యదర్శిగా గుడిది పిచ్చయ్య (సి కె న్యూస్)ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కమిటీ సభ్యులుగా.....
గడ్డం విజయ్....(ప్రజా దర్బార్)
శెట్టి సురేష్.......(సందేశం టైమ్స్)
గండారపు రామారావు....(సంచలన వార్త)
గంటల తిరుపతాచారి.....(మెట్రో ఉదయం)
వేర్పుల కోటేశ్వరరావు......(పయనించే సూర్యుడు)
చాపలమడుగు మంగతాయి....(ప్రజా వేదిక)
నూతన కమిటీ ఎంపికతో మండలంలో జర్నలిస్టుల ఐక్యతకు మరింత బలం చేకూరనుంది.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు, కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి ప్రెస్ క్లబ్ కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు మరియు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య వారధిగా నిలవాలని పేర్కొన్నారు.నూతన కమిటీ జర్నలిస్టుల ఐక్యతను కాపాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించి, పాత్రికేయ రంగ అభివృద్ధికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.