🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 15 October 2026, 12:38 pm Posted by : CK NEWS

చదువుతో పాటు రాజకీయ చైతన్యం అవసరం

News Image
  • చదువుతో పాటు రాజకీయ చైతన్యం అవసరం
  • యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో భాగస్వాములు కావాలి
  • నవోదయ విద్యార్థులకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు
  • సి కె న్యూస్ ప్రతినిది

వట్టెం, అక్టోబర్ 15: విద్యార్థులు చదువుతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సూచించారు. బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెంలోని జవహర్ నవోదయ పాఠశాలను ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించిన మల్లన్న వారి విద్యాభ్యాసం, పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్య ప్రాముఖ్యత, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో యువత పాత్ర తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

రాజకీయాలంటే కేవలం నాయకులు, ఎన్నికలే కాదని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం కూడా రాజకీయాల్లో భాగమేనని వివరించారు. విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు సమాజంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగడంతో పాటు రాజకీయ రంగంలోకి ప్రవేశించి ప్రజాసేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

విద్యార్థుల సమస్యలపై ఆరా

పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మల్లన్న అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు సామాజిక స్పృహతో ఎదిగి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.అనంతరం విద్యార్థులకు క్రియేటివ్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని పంపిణీ చేశారు

కార్యక్రమం అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ సుధారాణి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు,పాఠశాల సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు
🏠 Home