🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 October 2026, 6:04 pm Posted by : CK NEWS

వట్టెం గ్రామంలో టీఆర్పీ జెండాను ఆవిష్కరించిన: తీన్మార్ మల్లన్న

News Image
  • వట్టెం గ్రామంలో టీఆర్పీ జెండాను ఆవిష్కరించిన: తీన్మార్ మల్లన్న
  • సి కె న్యూస్ ప్రతినిది

నాగర్‌కర్నూల్ / బిజినేపల్లి: బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా బిజినేపల్లి మండల పరిధిలోని వట్టెం గ్రామంలో టీఆర్పీ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిలబడి పోరాడటమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రజా సమస్యల పరిష్కారానికి, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home