అన్నం పౌండేషన్ ఆశ్రమంలో హెల్త్ క్యాంప్
- అన్నం పౌండేషన్ ఆశ్రమంలో హెల్త్ క్యాంప్
- సి కె న్యూస్ ప్రతినిది ఖమ్మం
ఖమ్మం నగరంలోని అన్నం ఫౌండేషన్ ఆశ్రమంలో మంగళవారం కేసి పుల్లయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాధలకు ఇతర వృద్ధులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. అందరికీ హెచ్ఐవి పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు తో పాటు కేసి పుల్లయ్య ఫౌండేషన్ మేనేజర్ సుందర్, ఓ ఆర్ డబ్ల్యు ఆవుల నాగరాణి ,గోపాలరావు ,ఉమా తదితరులు పాల్గొన్నారు