🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 11 October 2026, 5:13 pm Posted by : Bhukya upendar

సత్తుపల్లిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తుమ్మల...

News Image
  • *సత్తుపల్లిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తుమ్మల....*
  • *పాల్గొన్న స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్...*


సత్తుపల్లిలో ఈరోజు ఉదయం ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరించారు.

ఈ కార్యక్రమములో మంత్రి తుమ్మలతో పాటు స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్ విజయ్ కుమార్ మరియు రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి తో పాటు ఆ సంఘ నాయకులు సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, తుమ్మల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home