ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు ఘన స్వాగతం
- ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు ఘన స్వాగతం
- శంషాబాద్ విమానాశ్రయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం
జపాన్లో జరిగిన ఆసియా క్రీడలు–2026లో ఆర్చరీలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడా ఆణిముత్యం తానిపర్తి చికిత హైదరాబాద్కు చేరుకున్న సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్వాగత కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు అశోక్ కుమార్, శ్రీనివాస్, కన్నం మధు, సురేష్ కాలేరు, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి మల్లారెడ్డి, ఆర్చరీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు టి. రాజు, అరవింద్ తదితరులు పాల్గొని చికితకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా చికితతో పాటు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు రెండు స్వర్ణ పతకాలు అందించిన చికిత విజయాన్ని అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రశంసించారు.