గోర్ మేళో మత్రో సభ కరపత్రాల ఆవిష్కరణ
- గోర్ మేళో మత్రో సభ కరపత్రాల ఆవిష్కరణ
షాద్‌నగర్, అక్టోబర్ 4:* షాద్‌నగర్ పట్టణ కేంద్రంలోని నేషనల్ మార్ట్ ఎదురుగా, తిరుమల బ్యాంక్వెట్ హాల్ , మహబూబ్‌నగర్ రోడ్ అక్టోబర్ 11, 2026 ఆదివారం నిర్వహించనున్న గోర్ మేళో మత్రో సభ కరపత్రాలు కూడిచర్ల తండా గ్రామపంచాయతీ సర్పంచ్ శాంతి విష్ణు నాయక్, మాజీ సర్పంచ్ సంతోష్ నాయక్* చేతుల మీదుగా ఆవిష్కరించారు.
సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభకు సంబంధించిన కరపత్రాలను బాబు రాజ్ ఆవిష్కరించి, గోర్ బంజారా సమాజం ఐక్యతగా ఉండి తమ హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని కోరారు.
ఈ సందర్భంగా విష్ణు నాయక్ మాట్లాడుతూ గిరిజన లంబాడీ బిడ్డలందరూ ఐక్యతతో ఉండి తమ హక్కులను సాధించుకోవాలని* అన్నారు. షాద్‌నగర్‌లో నిర్వహిస్తున్న గోర్ మేళో మాత్రో సభకు నియోజకవర్గంలోని ప్రతి తండా నాయకులు, కుల పెద్దలు, సంఘ నాయకులు మరియు గిరిజన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ సర్పంచ్ సంతోష్ నాయక్ మాట్లాడుతూ గోర్ బంజారా సమాజం ఐక్యత, హక్కులు, అభివృద్ధి మరియు భవిష్యత్ తరాల సంక్షేమంపై చర్చించేందుకు ఈ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి తండా నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో గ్రామం పెద్దలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
సభ వివరాలు:
తేదీ: 11-10-2026, ఆదివారం
వేదిక: నేషనల్ మార్ట్ ఎదురుగా, తిరుమల బ్యాంక్వెట్ హాల్, మహబూబ్‌నగర్ రోడ్, షాద్‌నగర్.