కూలీల ప్రమాద ఘటనపై మాజీ ఎమ్మెల్యే కందాళ దిగ్భ్రాంతి...
- కూలీల ప్రమాద ఘటనపై మాజీ ఎమ్మెల్యే కందాళ దిగ్భ్రాంతి...
ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామానికి చెందిన కూలీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే విషయం తెలుసుకుని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
రఘునాథపాలెం మండలంలోని పంగిడి సమీపంలో పత్తి తీసే పనులకు వెళ్లి ఆటోలో వస్తుండగా లారీ ఢీకొని దొంతు సరుపు భారతమ్మ (55) అనే మహిళ మృతి చెందగా, మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండడం, 12 మంది కూలీలు గాయాలపాలయ్యారనే విషయం తెలుసుకుని ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం వైద్యాధికారులతో ఫోన్లో మాట్లాడి, గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.