రోడ్డు ప్రమాద క్షతగాత్ర కూలీలకు పరామర్శించిన దయాకర్ రెడ్డి
- రోడ్డు ప్రమాద క్షతగాత్ర కూలీలకు పరామర్శ
*ఖమ్మం:* రఘునాథ పాలెం వద్ద రోడ్డు ప్రమాదానికి గురై ఖమ్మంలోని ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కామంచికల్ గ్రామ కూలీలను రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. దొంతుసరపు భారతమ్మ అనే మహిళా కూలీ మృతి చెందగా ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం చికిత్స పొందుతున్న క్షతగాత్రులు అందరి వద్దకు వెళ్లి.. వారి ఆరోగ్య వివరాలను వైద్యుల ద్వారా తెలుసుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు.. ఇప్పటికే వైద్యాధికారులతో ఫోన్లో మాట్లాడారని, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తోట వీరభద్రం, నాయకులు ప్రతాపనేని రఘు, తదితరులు పాల్గొన్నారు.