టీ.ఎ1 పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించిన పునర్వి కాసోజు
- ఖమ్మం త్రివేణి లో 6వ తరగతి టీ.ఎ1 పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించిన పునర్వి కాసోజు.
- ఖమ్మం,29 సెప్టెంబర్:
ఖమ్మం త్రివేణి పాఠశాలలో 6వ తరగతి ఐ.ఐ.టీ విభాగం ప్రైమ్ సెక్షన్ లో చదువుతున్న కాసోజు పునర్వి పాఠశాల నిర్వహించిన, టీ.ఎ1 పరీక్షలో ప్రథమ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ పునర్విని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు చిన్ననాటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారిస్తే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని అన్నారు. పునర్వి టీ.ఎ1 పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించడం ఆమె పట్టుదల, కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.విద్యార్థులు పరీక్షలను కేవలం మార్కుల కోసం కాకుండా తమ ప్రతిభను అంచనా వేసుకునే అవకాశంగా భావించాలని సూచించారు. పునర్వి ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్స్ స్వప్న, ముస్తఫా, సి.ఆర్.ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ, క్యాంపస్ ఇంచార్జ్ విక్టర్ చార్లెస్, ఇంచార్జ్ అశోక్, జూనియర్ ఇంచార్జ్ అనూష, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని పునర్వి ని అభినందించారు.