కేతనపల్లి ప్రైమరీ స్కూల్‌ను సందర్శించిన తీన్మార్ మల్లన్న
- కేతనపల్లి ప్రైమరీ స్కూల్‌ను సందర్శించిన తీన్మార్ మల్లన్న
బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా కేతనపల్లి గ్రామానికి చేరుకున్న తీన్మార్ మల్లన్న స్థానిక ప్రైమరీ స్కూల్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించిన మల్లన్న, వారికి అందుతున్న విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్‌ల నాణ్యతతో పాటు పాఠశాలలోని మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి చదువు, పాఠశాల పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడిన మల్లన్న, విద్యాబోధనలో ఎదురవుతున్న ఇబ్బందులు, పాఠశాలకు అవసరమైన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.