🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 28 September 2026, 7:54 pm Posted by : CK NEWS

కంటైనర్‌ను ఢీకొట్టిన అడిషనల్‌ కలెక్టర్‌ కారు

News Image
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌ ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది.
హైదరాబాద్‌ నుంచి కొత్తగూడెం వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రి వద్ద ఫ్లైఓవర్‌పై ముందున్న కంటైనర్‌ యూటర్న్‌ తీసుకుంటున్న సమయంలో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతినగా వేణుగోపాల్‌ సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
🏠 Home