🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 26 September 2026, 5:44 pm Posted by : CK NEWS

రాజుతండా అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాల కార్యక్రమం

News Image
  • రాజుతండా అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాల కార్యక్రమం*

సి కె న్యూస్ ప్రతినిది కుసుమంచి
కూసుమంచి మండలం మల్లాయిగూడెం గ్రామపంచాయతీలోని రాజు తండా అంగన్వాడి కేంద్రంలో ఐ సి డి ఎస్ సూపర్వైజర్ ఉమా ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవాల కార్యక్రమన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తహీనత గురించి, మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు కలిగి ఉన్న సమతుల ఆహారాన్ని తీసుకోవాలని చిన్నతనంలోనే పిల్లలకు మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించాలని జంక్ ఫుడ్ కూల్ డ్రింక్ లు పిల్లలకు దూరంగా ఉంచాలన్నారు ఈ రోజు మనం ఇచ్చే ఆహారమే రేపు పిల్లలకు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు దోహద పడుతుందని తెలిపారు

ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉమా మేడం హెల్త్ స్టాఫ్ హైమావతి , సుజాత భాయ్ అంగన్వాడీ టీచర్స్ స్వాతి, చంద్రావతి, గర్భిణీ స్త్రీలు బాలింతలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
🏠 Home