🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 26 September 2026, 12:09 pm Posted by : CK NEWS

గ్రామీణులకు సేవలందించిన నాటువైద్యుడు మృతి

News Image
  • గ్రామీణులకు సేవలందించిన నాటువైద్యుడు మృతి
  • అప్పారావు మృతితో గార్లఒడ్డులో విషాదం
  • నాటువైద్యుడికి ప్రజాప్రతినిధుల నివాళి
  • అప్పారావు పార్థివ దేహానికి ఎమ్మెల్యే రాందాస్‌ నివాళి

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ ఏన్కూరు సెప్టెంబర్‌ 26 2026: మండలంలోని గార్లఒడ్డు గ్రామానికి చెందిన ప్రముఖ నాటువైద్యుడు, సొసైటీ చైర్మన్ వెంకటేశ్వరరావు సోదరుడు శెట్టిపల్లి అప్పారావు (90) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. గత కొన్నేళ్లుగా నాటువైద్య సేవలు అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పలువురికి వైద్యం అందించిన అప్పారావు మృతి పట్ల గ్రామస్థులు, బంధువులు, పరిచయస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అప్పారావు మృతిచెందిన విషయం తెలుసుకున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు గార్లఒడ్డుకు చేరుకుని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అప్పారావుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ గార్లఒడ్డుకు చేరుకుని అప్పారావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అప్పారావు మృతి గ్రామానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు.
అప్పారావు అంత్యక్రియల సందర్భంగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
🏠 Home