🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 26 September 2026, 9:35 am Posted by : CK NEWS

కొత్తూరులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్*

News Image
  • *కొత్తూరులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్*
  • *29 గ్రాముల గంజాయి స్వాధీనం ఒక కీప్యాడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు కొత్తూరు పోలీసులు

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని కొత్తూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 29 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నాట్లు కొత్తూరు .పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రోజునా (25.09.2026) మధ్యాహ్నం సుమారు 12:00 గంటల ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక విజయలక్ష్మి చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద 29 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు వివరాలు వెళ్ళితే బీహార్ రాష్ట్రానికి చెందిన గోలు కుమార్ (18) (తండ్రి: థేతర్ చంద్ర వంశీ), ప్రస్తుతం కొత్తూరులో కూలీ పని చేస్తూనాటు వివరించాడు కొత్తూరులో నివాసముంటున్నట్లు తెలిసింది.
అతని వద్ద ఉన్న నలుపు రంగు ప్లాస్టిక్ కవర్‌ను పరిశీలించగా 2 ప్యాకెట్లలో ఉన్న 29 గ్రాముల గంజాయి లభించింది. సదరు నిందితుడు ఒక గుర్తుతెలియని వ్యక్తి వద్ద ఈ గంజాయిని కొనుగోలు చేసి, స్థానిక ఇండస్ట్రియల్ ఏరియాలోని కార్మికులకు (లేబర్‌కు) విక్రయిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు.స్వాధీనం చేసుకున్న వస్తువులు ఈ మేరకు కొత్తూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. వివరించారు
🏠 Home